పుత్రభిక్ష పెట్టండి
● కొడుకు కోసం తల్లిదండ్రుల ఆరాటం
● నెలకు వైద్యానికి రూ.2.50 లక్షలు..
● ఇప్పటి వరకు రూ.30 లక్షలు ఖర్చు
● ఆపన్నహస్తం అందించాలని వేడుకోలు
రాయికల్(జగిత్యాల): చేతికందే సమయంలో కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎలాగైనా కన్న పేగును దక్కించుకోవాలనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఇప్పటి వరకు అందినకాడ అప్పు చేసి సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం చేతిలో డబ్బు లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదరుచూస్తున్నా రు. వివరాలు.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన సిరిపురం మల్లేశ్ దర్జీ పని చేస్తుండగా అతడి భార్య సంధ్య బీడీ కార్మికురాలు. వీరి పెద్ద కొడుకు చరణ్ (22 ఏళ్లు). ఈ ఏడాది ఫిబ్రవరిలో అయోధ్య–కుమ్మరిపల్లి గ్రామాల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ చేసిన అనంతరం హైదరాబాద్‌లోని రిహబ్ కేర్ సెంటర్‌కు తరలించారు. చరణ్ ఆరోగ్యం మెరుగుపడాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రతినెలా సుమారు రూ.2.50 లక్షల ఖర్చవుతోంది. తల్లి అతడి వద్దే ఆస్పత్రిలో ఉంటుండగా తండ్రి దర్జీ పనిచేస్తూ కొడుకును బతికించుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. మరో 4–5 నెలల వరకు చరణ్‌లో కదిలిక వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొనడంతో ఆ పేద తల్లిదండ్రులు తమ కొడుకును ఎలాగైనా బతికించుకోవాలనే ఆశతో ఉన్న ఆస్తులు సైతం అమ్మారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు స్పందించి ఆర్థికసాయం అందించాలని వేడుకుంటున్నారు.
దాతలు సాయం చేయడానికి
ఫోన్‌పే నంబర్లు : 99638 08663
91214 04030
Comments
Please login to add a commentAdd a comment