బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లో రెండున్నరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కిడ్నాప్‌నకు గురైన బాలుడిని తల్లి వద్దకు పోలీసులు చేర్చారు. ఈ కేసులో ముగ్గురిని సోమవారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. వన్‌టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు.. గత నెల 27న కామారెడ్డికి చెందిన కరీంనగర్, చాకలివాడలో నివాసముంటున్న షేక్‌లీనా తన రెండున్నరేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేశారని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ఎస్సై రాజన్న, కానిస్టేబుళ్లు కుమార్, బషీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలించారు. సీసీ పుటేజీ, ఇతర టెక్నాలజీ ఆధారంగా నిందితులు కరీంనగర్ చాకలివాడకు చెందిన దాసరి స్వరూప అలియాస్ సరోజ, మోతె కృష్ణ కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. అనంతరం బాలుడిని సాధనవేణి అలియాస్ బొజ్జ లలియా అలియాస్ లత, సాధనవేణి రమేశ్ దంపతులకు రూ.50 వేలకు అమ్మారు. ఈ కేసులో మోతె కృష్ణ పరారీలో ఉన్నాడు. దాసరి స్వరూప అలియాన్ సరోజ, సాధనవేణి లలియా, రమేశ్‌ను జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
తల్లి నుంచి అపహరించి రూ.50 వేలకు అమ్మకం
ముగ్గురిని రిమాండ్ చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment