కొనుగోళ్లు సజావుగా చేపట్టాలి
పెగడపల్లి: ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా చేపట్టాలని అదనపు కలెక్టర్ లత తెలిపారు. మండలకేంద్రంలో ప్యాక్స్, అయితిపల్లిలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సోమవారం సందర్శించారు. సరిపడా కాంటాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలన్నారు. మండల అధికారులు ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీసీవో మనోజ్‌కుమార్, డీఎం జితేంద్రప్రసాద్, తహసీల్దార్ రవీందర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయికిరణ్, ఏపీఎం సమత, సీఈవో గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలి
మల్లాపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని డీసీసీబీ జిల్లా డైరెక్టర్ తక్కల్ల నరేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముత్యంపేటలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. నిర్వాహకులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని తెలిపారు. ప్యాక్స్ సీఈవో రమేశ్, వైస్ చైర్మన్ ఆరే రాజేందర్, డైరెక్టర్లు ఏలేటి వెంకటేశ్వర్‌రెడ్డి, వాకిటి భూమారెడ్డి, తేలు ముత్యంరెడ్డి, ఉదగిరి లింబాద్రి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment