హరీశ్‌రావు వాస్తవాలు మాట్లాడాలి
● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: హరీశ్‌రావు వాస్తవాలు మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ధాన్యం సేకరణలో ఇప్పటికే ముందంజలో ఉన్నామన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. నిర్వాసితులకు న్యాయం చేశాకే మూసీప్రక్షాళన చేస్తామన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందన్నారు. కాంగ్రెస్ ఏకకాలంలో రూ.18వేల కోట్లు మాఫీ చేశామన్నారు. అడ్లూరి మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి త్వరలోనే చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధి, రుణమాఫీపై హరీశ్‌రావు సిద్ధమా అని ప్రశ్నించారు. ధర్మపురిలో పూజలు, యాగాలు చేసిన కేసీఆర్ రూ.500 కోట్లతో అభివృద్ది చేస్తానంటూ మోసం చేశారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, బల్దియా మాజీ చైర్మన్ విజయలక్ష్మి, నాయకులు బండ శంకర్, మహ్మద్ భారీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment