బాలల నేస్తం.. చాచా నెహ్రూ..
నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి జాతి సంపదలు.. విరిసివిరియని కుసుమాలు సరైన విద్యతో మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు సుసంపన్నమైన దేశం కోసం.. సిద్ధమవుతున్న నేటి ఆణిముత్యాలే రేపటి మన జాతి రత్నాలు. తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు.. భావి భారత పౌరులు. వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పుదాం. పాలబుగ్గల నవ్వులు, అపురూపమైన క్షణాలు.. మరపురాని జ్ఞాపకాలు.. బాల్యం ఒక వరం. పిల్లలు భగవంతుని స్వరూపాలు.. కల్లకపటం ఎరుగని కరుణామయులు.. రివ్వున ఎగిరే గువ్వలు..
నవంబర్ 14 వచ్చింది.. బాలలకు బోలెడు సందడి తెచ్చింది. ఈ రోజంటే పిల్లలకు పండగ లాంటిది. బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయణ్ని ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. అందుకే 1889 నవంబర్ 14న నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆయన బర్త్‌డేను ‘చిల్డ్రన్స్ డే’ నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలను పంచిపెడతారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహం నింపుతారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే..
Comments
Please login to add a commentAdd a comment