జగిత్యాలటౌన్: ఆర్టీసీ కార్మిక సంఘాలపై గత ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు బొమ్మెన సురేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. సంస్థ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని, సామాజిక భద్రత పథకాల్లో కార్మిక సంఘాల భాగస్వామ్యంతో బోర్టు ఆఫ్ ట్రస్టీలను నియమించాలని కోరారు. కార్మికులపై పనిభారం పెంచుతున్నారని, మహిళలకు అర్ధరాత్రి వరకూ డ్యూటీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ డ్యూటీల పేరుతో డిపో మేనేజర్లు వేధిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటచారి, బొర్ర శేఖర్, గర్వందుల రమేశ్, మల్యాల సురేష్, ఎండీ.రఫిక్, అజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment