ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం
కథలాపూర్: ఎన్నికల వేళ ఇచ్చి న హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం కథలాపూర్‌లో కాంగ్రెస్ నాయకులతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారని, రూ.126 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారని పేర్కొన్నారు. సభకు భారీగా తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు ఎండీ.అజీమ్, తొట్ల అంజయ్య, పూండ్ర నారాయణరెడ్డి, ఆకుల సంతోష్, తలారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment