జగిత్యాల అభివృద్ధే లక్ష్యం
జగిత్యాలటౌన్: జగిత్యాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పొన్నాల గార్డెన్లో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి, ప్రజాపాలన వేడుకల్లో పాల్గొన్నారు. 170మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. తమది మొదటి నుంచే కాంగ్రెస్ కుటుంబమని, అంతర్గాంలో దళితుల కోసం నాడే ఎనిమిది ఎకరాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీల అమలుతో ప్రజల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment