కొనుగోళ్లను వేగవంతం చేయాలి
● సన్నాలకు రూ.500 బోనస్ జమ చేయాలి
● రైతులకు ఇబ్బంది రానీయొద్దు
● కలెక్టర్ సత్యప్రసాద్
మల్లాపూర్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని కుస్తాపూర్, ముత్యంపేటలోని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలని, వారికి ఇబ్బందులు తల్తెతకుండా చూడాలని సూచించారు. ట్యాబ్‌లలో డాటా ఎంట్రీ వేగవంతం చేయాలని, సన్నం రకం ధాన్యానికి రూ.500 బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో రఘువరన్, డీసీవో మనోజ్‌కుమార్, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వీర్‌సింగ్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం దేవరాజ్, సీసీలు స్రవంతి, రాజు, రైతులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రోజువారీ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్, కేజీబీవీ విద్యాలయాన్ని తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, వంటశాల, స్టోర్‌రూంను తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లను శానిటేషన్ చేయించాలని సూచించారు. ప్రహరీ నిర్మాణం, మెయిన్‌గేట్ నిర్మించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్డీవోను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment