మాస్టర్‌ప్లాన్‌కు తగ్గట్లు నిర్మాణాలు చేపట్టాలి
జగిత్యాల:మాస్టర్ ప్లాన్‌కు తగ్గట్లు నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం పలు కాలనీల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. డ్రెయినేజీలను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలతో డ్రెయినేజీలు కనుమరగయ్యాయని తెలిపారు. పారిశుధ్యం, పచ్చదనంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని, చెత్తబండికి తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వాలని పేర్కొన్నారు. సంఘ భవనాలు, పాఠశాలలు, రోడ్లు, డ్రెయినేజీలకు రూ.2 కోట్లు మంజూరయ్యాయని, వాటితో నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివా్‌స్, గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్ మల్లవ్వ, గోపి పాల్గొన్నారు.
గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటాం
గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 8 మంది కార్మికులు గల్ఫ్‌లో మరణించగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.40 లక్షల విలువైన ప్రొసీడింగ్‌లను అందించారు. పట్టణంలోని ఉప్పరిపేటకు చెందిన మానుక మహేశ్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతుండగా సీఎం సహాయనిధి ద్వారా రూ.2.50 లక్షల చెక్కును అందించారు. ముప్పాల రాంచందర్‌రావు, గోలి శ్రీనివాస్, రాజిరెడ్డి, రవీందర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment