గిరిజన ఆశ్రమ పాఠశాలలో అందరూ కాంట్రాక్టు ఉపాధ్యాయులే.. | - | Sakshi
Sakshi News home page

గిరిజన ఆశ్రమ పాఠశాలలో అందరూ కాంట్రాక్టు ఉపాధ్యాయులే..

Published Fri, Nov 29 2024 1:28 AM | Last Updated on Fri, Nov 29 2024 1:28 AM

గిరిజ

గిరిజన ఆశ్రమ పాఠశాలలో అందరూ కాంట్రాక్టు ఉపాధ్యాయులే..

రాయికల్‌: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన జగన్నాథపూర్‌ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే వారంతా కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన విధులు నిర్వర్తిస్తున్నవారే. విశేషమేమంటే ప్రధానోపాధ్యాయుడు కూడా ఇన్‌చార్జినే. దీంతో పాఠశాలను పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 8వరకు తరగతులు ఉన్నాయి. 50మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్‌ ఉపాధ్యాయులను మాత్రం నియమించలేదు. కాంట్రాక్ట్‌ పద్ధతిన ఐదుగురు ఉపాధ్యాయులతో నెట్టుకొస్తోంది. బీర్‌పూర్‌ మండలం చిత్రవేణిగూడెంకు చెందిన శ్రీనివాస్‌ను ఈ ఆశ్రమ పాఠశాలకు ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడిగా నియమించారు. ఈ విషయంపై జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సాయిబాబాను శ్రీసాక్షిశ్రీ సంప్రదించగా.. త్వరలో రెగ్యులర్‌ ఉపాధ్యాయులను నియమిస్తుందని తెలిపారు.

హెచ్‌ఎం, వార్డెన్‌ ఇన్‌చార్జులే..

No comments yet. Be the first to comment!
Add a comment
గిరిజన ఆశ్రమ పాఠశాలలో అందరూ కాంట్రాక్టు ఉపాధ్యాయులే..1
1/1

గిరిజన ఆశ్రమ పాఠశాలలో అందరూ కాంట్రాక్టు ఉపాధ్యాయులే..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement