పాడి పరిశ్రమ ఏర్పాటుకు రుణాలు
ఓదెల(పెద్దపల్లి): కరీంనగర్ డైయిరీ ద్వార రూ.440 కోట్ల ఆదాయం వచ్చిందని చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని మడకలో పాలకేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని డెయిరీ ద్వారా రూ.440కోట్ల ఆదాయం వస్తే అందులో రైతులకు రూ.375కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు డెయిరీ దోహదపడుతుందన్నారు. రైతులు ఇంటింటా పాడిపరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు డెయిరీ ద్వారా రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకుడు గుడిపాటి కేశవరెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్, మేనేజర్, సిబ్బందిని సన్మానించి, మల్లికార్జునస్వామి మెమోంటోలు బహూకరించారు. డెయిరీ మేనేజర్ ముస్కు అంజారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ మోహన్‌రెడ్డి, డైరెక్టర్ మధుకర్, బాపురావు, సూపర్‌వైజర్ రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment