రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
మేడిపల్లి: భీమారం మండలం గోవిందారం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకునూరి అశ్విత, భూపతి అవంతిక, తుమ్మ హర్షవర్ధన్ అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్‌పెల్లిలో వారం క్రితం జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో జావెలిన్ త్రో, 600మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలలో ప్రదర్శన కనబర్చారని సంఘం ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్యంరెడ్డి తెలిపారు. విద్యార్థులను హెచ్‌ఎం అస్ఫాక్ హుస్సేన్, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
క్యారంలో రజనీకి ప్రథమ బహుమతి
కోరుట్ల: కోరుట్ల మున్సిపల్ కార్యాలయం ఉద్యోగి, వికలాంగురాలు బి.రజనీ రాష్ట్రస్థాయి క్యారం పోటీల్లో మొదటి బహుమతి సాధించింది. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వికలాంగుల క్రీడల్లో ఆమె మొదటి బహుమతి గెలుచుకుంది. రాష్ట్ర వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ నుంచి బహుమతి అందుకుంది.
పోచమ్మ బోనాల్లో అపశృతి
● గుండెపోటుతో వ్యక్తి మృతి
రాయికల్: మండలంలోని అల్లీపూర్‌లో గురువారం నిర్వహించిన పోచమ్మతల్లి బోనాల్లో అపశృతి చోటుచేసుకుంది. గ్రామస్తులు పోచమ్మతల్లికి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తుండగా బోదనపు గంగాధర్ (60) గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందాడు. శోభాయాత్ర నిర్వహిస్తుండగా గంగాధర్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో స్థానికులు ప్రథమ చికిత్స చేసినా ఫలితం లేకుండాపోయింది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
స్వగ్రామానికి చేరిన వలసజీవి మృతదేహం
కథలాపూర్(వేములవాడ): భూషణరావుపేటకు చెందిన దీకొండ సురేశ్ (38) సౌదీఅరేబియాలో ఈనెల 16న గుండెపోటుతో మృతిచెందాడు. ఆయ న మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. అప్పు చేసి గల్ఫ్ బాట పట్టగా.. అప్పులు తీరక ముందే సురేశ్ మృత్యువాత పడటంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. సురేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment