యువత కోసం మెగా జాబ్‌మేళా
● 50 కంపెనీల ఆధ్వర్యంలో..
● రెండు వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు
● ఎస్పీ అశోక్‌కుమార్ వెల్లడి
జగిత్యాలక్రైం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 11న మెగా ఎస్పీ కార్యాలయం ఆవరణలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. సుమారు 50 కంపెనీలతో రెండు వేలకుపైగా ఉద్యోగ అవకాశాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కార్యక్రమం కొనసాగుతుందని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూల అనంతరం నియామక పత్రాలు అందిస్తారని తెలిపారు. యువత క్యూఆర్ కోడ్ ద్వారా పూర్తి వివరాలతో నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రవీంద్రకుమార్, రఘుచందర్, రాములు, ఆర్‌ఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
నేర విచారణ సమర్థవంతంగా చేపట్టాలి
వివిధ కేసుల్లో నేర విచారణను సమర్థవంతంగా చేపట్టాలని, పెండింగ్ కేసులు తగ్గించాలని ఎస్పీ అన్నారు. పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. జిల్లా సరిహద్దుల నుంచి గంజాయి సరఫరా కాకుండా చూడాలని, కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ డ్రంకెన్‌డ్రైవ్ టెస్ట్‌లు చేపట్టాలన్నారు. రౌడీ, హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఎస్బీ, ఐటీ కోర్ సీఐలు ఆరిఫ్ అలీఖాన్, రఫీక్ ఖాన్, రాంనరసింహారెడ్డి, రవి, నిరంజన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సురేశ్, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment