కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం
● బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి
రాయికల్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి అన్నారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎంగా కేసీఆర్‌ను చూడటమే లక్ష్యంగా ఎన్ఆర్ఐ యూకే సభ్యులంతా కష్టపడి పనిచేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వివరిస్తామని పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసిన ఎన్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, కో–ఆర్డినేటర్ మహేశ్ బింగాల, మాజీ అధ్యక్షుడు అశోక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment