వేములవాడ: వేములవాడలోని మెయిన్‌రోడ్డు విస్తరణకు అధికారులు గురువారం కొలతలు వేస్తున్నారు. ఇటీవల రోడ్ల విస్తరణపై ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించడంతో మెయిన్‌రోడ్డుపై మరో సారి కొలతలు వేసేందుకు 16 మంది నాలుగు బృందాలుగా రంగంలోకి దిగారు. మెయిన్‌రోడ్డులోని ఇళ్లు, దుకాణాలకు మరోసారి అంచనా వేస్తున్నారు. గతంలో వేసిన అంచనాలను తిరిగి పునర్ పరిశీలిస్తూ, సదరు యజమాని వివరాలు, కొలతలు సరి చూస్తున్నారు. ఈ కార్యక్రజుమంలో ఆర్‌ఐలు నవీన్‌కుమార్, మధు, సర్వేయర్లు మధుసూదన్, చామంతి, ఏఈలు గోవింద్, నర్మద, మయూరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment