మెట్‌పల్లిరూరల్: పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో తహసీల్దార్ శ్రీనివాస్, మేడిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో నాయబ్ తహసీల్దార్ రాజ్‌మహ్మద్, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఆర్‌ఐ ఉమేశ్ గురువా రం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజన నాణ్యత ఎలా ఉంది..? పరిశుభ్రత పాటిస్తున్నారా..? లేదా అని గమనించడంతోపాటు పలు విషయాలపై నిర్వహకులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.
భోజనంలో నాణ్యత పాటించాలి
పెగడపల్లి: మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్.లత నిర్వాహకులకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. వంటగది, వంట సామగ్రిని పరిశీలించారు. నాణ్యతను తనిఖీ చేశారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ రవీందర్, డెప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, ఆర్‌ఐ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భోజనం నాణ్యత లేకుంటే చర్యలు
ఇబ్రహీంపట్నం: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యతతో ఉండాలని తహసీల్దార్ ప్రసాద్ అన్నారు.ఎర్దండి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మోడల్ స్కూల్‌లో ఎంపీడీవో చంద్రశేఖర్, ఎస్సీ హాస్టల్‌లో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ భోజనాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం తనిఖీలకు అధికారులను నియమించారు.
సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో..
సారంగాపూర్: సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు గురువారం మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. కీమనాయక్‌తండా, రేచపల్లిలో సారంగాపూర్ ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో శశికుమార్‌రెడ్డి, సారంగాపూర్ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ జమీర్, ఎంఈవో కిషోర్, ఆర్‌ఐ భాస్కర్‌రావు, బీర్‌పూర్‌లో ఎంపీడీవో లచ్చాలు, కొల్వాయిలో బీర్‌పూర్ తహసీల్దార్ ముంతాజొద్దీన్, తుంగూర్‌లో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీవో నాగభూషణం, ఆర్‌ఐ శ్రీనివాస్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజన నాణ్యత పరిశీలించారు.
నాణ్యమైన భోజనం అందించాలి
జగిత్యాల: జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రాంమో హన్ ఓల్డ్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
జగన్నాథపూర్ గ్రామంలో..
రాయికల్: జగన్నాథపూర్ గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను గురువారం తహసీల్దార్ ఖయ్యూం తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కౌన్సిలర్ మ్యాకల అనురాధ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment