మహా లింగార్చన
ధర్మపురి: మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహా లింగార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు పంచదశ ఆవరణ పూజ, హారతి, మంత్రపుష్పము తదితర పూజలు చేశారు. వేదపండితులు బొజ్జ సంపత్‌కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పట్టుదలతో చదవాలి
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): విద్యార్థులు పట్టుదలతో చదవాలని జిల్లా విద్యాధికారి రాము అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం కస్తూ రిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయని, ఇప్పటికే సిలబస్ పూర్తి అయినందున విద్యార్థులు గ్రూప్‌గా ఏర్పడి ఒకరికొకరు సబ్జెక్ట్ వారీగా ప్రశ్నలు, జవాబులు చెప్పుకుంటూ చదువుకోవాలని సూచించారు. చదువుమీద దృష్టిపెట్టి మంచి మార్కులు సాధించాలని కోరారు. 10, 6వ తరగతుల విద్యార్థుల వద్దకు వెళ్లి చదువులు ఏ విధంగా కొనసాగిస్తున్నారని ఆరా తీశారు. ఉపాధ్యాయులు వారి సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారని, మీరు ‘మా ఉపాధ్యాయులే కావాలి’ అని కోరడం సరికాదన్నా రు. చదువులో నష్టపోకుండా సదరు ఉపాధ్యాయులు వచ్చేవరకు ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లు చదువు చెబుతారని, చక్కగా విని శ్రద్ధతో చదవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌టీ శారద, ఏఎన్‌ఎం భవాని తదితరులు ఉన్నారు.
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
జగిత్యాలటౌన్: సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుర్రం రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత, మినిమం స్కేల్ అమలు డిమాండ్‌తో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. సమ్మెలో టీఆర్‌టీఎఫ్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన వరంగల్ డిక్లరేషన్‌లో అఽ దికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా వారి గోడు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సు ప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేశారు. టీఆర్‌టీఎఫ్ నాయకులు, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment