రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో పతకాలు
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఇటీవల జరిగిన 9వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్, కేడెట్ బాలబాలికల జూడో పోటీల్లో కరీంనగర్ మానేరు విద్యాసంస్థల విద్యార్థులు పతకాలు సాధించినట్లు చైర్మన్ అనంతరెడ్డి తెలిపారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో 57 కేజీలలోపు కేటగిరీలో బింగి మన్విత, 60 కేజీలలోపు కేటగిరీలో నిషిత్ రెడ్డి బంగారు పతకాలు సాధించారన్నారు. కేడెట్ విభాగంలో 81 కేజీలలోపు కేటగిరీలో అమన్ రెడ్డి రజత పతకం గెలిచినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని అభినందించారు. జాతీయ పోటీల్లోనూ సత్తా చాటి, పతకాలు గెలవాలని సూచించారు. విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతా రెడ్డి, ప్రిన్సిపాల్ సరితారెడ్డి, పీఈటీలు మహేందర్, జహేద, శిరీష, తిరుపతి, స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment