రోడ్డుప్రమాదాలు నివారించాలి
● గురుకులాల్లో ఆహార నాణ్యత తనిఖీ చేయాలి ● వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్
జగిత్యాల: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా భద్రత వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇవి ప్రతి గ్రా మం, ప్రతి మండలంలో చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూ ళ్లలో పిల్లలకు అవగాహ న కల్పించాలన్నారు. సంక్రాంతి సెలవుల త ర్వాత విద్యార్థులతో భా రీ ర్యాలీ తీయాలన్నా రు. రవాణా, పోలీసు, విద్య, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించని వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్‌లో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. హెల్మెట్ వినియోగంతో కలిగే లాభాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిన దృష్ట్యా ఆయా మార్గాల్లో బస్సుల సంఖ్య పెంచుతామన్నారు. గురుకులాల్లో నాణ్యమైనా ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిచోట ఆక్సిడెంట్‌ప్రోన్ ఏరియా గుర్తించాలని పేర్కొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment