స్కూల్‌కు సైకిల్‌పై వెళ్తున్న టీచర్లు
కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్ సైన్స్ టీచర్ ఉయ్యాల రమేశ్ స్వగ్రామం కోరుట్ల మండలం ఏఖీన్‌పూర్. గతంలో బైక్‌పై పాఠశాలకు వచ్చి, వెళ్లేవారు. వాతావరణ కాలుష్యం గురించి విద్యార్థులకు బోధిస్తున్న తాను ఆచరించడలేదని భావించి, రెండేళ్ల క్రితం సైకిల్ కొనుగోలు చేశారు. ఇంటి నుంచి పాఠశాలకు, తిరిగి ఇంటికి మొత్తం 25 కిలోమీటర్లు వెళ్లేందుకు సైకిల్‌నే వాడుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు మార్గదర్శిగా ఉండటంతోపాటు వ్యాయామం చేసినట్లవుతోందని ఆయన చెబుతున్నారు. గంభీర్‌పూర్ గ్రామానికి చెందిన గుండు విజయ్ తాండ్య్రాల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. బైక్‌పై వెళ్తే పొగ వెలువడి, వాతావరణం కాలుష్యమవుతుందని ప్రతీరోజు సుమారు 2 కిలోమీటర్లు స్కూల్‌కు సైకిల్‌పై వెళ్లి వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment