కష్టపడి పనిచేస్తే మంచి గుర్తింపు
జగిత్యాలక్రైం: కష్టపడి పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పోలీస్ శాఖ నుంచి రాష్ట్ర పతకాలకు ఎంపికై న వారిని శనివారం ఎస్పీ కార్యాలయంలో అభినందించారు. విధి నిర్వహణలో కష్టపడి పనిచేసిన వారికి గౌరవం పెరుగుతుందన్నారు. ప్రజ లకు ఉత్తమమైన సేవలందించాలని, నిజాయి తీ కనబర్చుతూ మరిన్ని పతకాలు అందుకోవా లని ఆకాంక్షించారు. అడిషనల్ ఎస్పీ భీంరావు, రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
తల్లిదండ్రులను విస్మరిస్తే చర్యలు
జగిత్యాల: తల్లిదండ్రులను విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్డీవో మధుసూదన్ హెచ్చరించారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో పలు కుటుంబసభ్యులకు కౌ న్సెలింగ్ ఇచ్చారు. వయోవృద్ధుల పోషణ బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరిస్తే చర్యలు తీసుకుంటామని, 2007 సెక్షన్ 24 ప్రకారం జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన మహ్మద్ అల్కమ్మద్, బుగ్గారం మండలా నికి చెందిన కల్లెం చిన్నన్న, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన అనుమండ్ల కళావతి వారి కొడుకులు, కూతుళ్లు, కోడళ్లపై ఫిర్యాదు చేయగా కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తఫజుల్ హుస్సే న్, హరి అశోక్‌కుమార్, ప్రకాశ్, విశ్వనాథ్, పద్మజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment