పాము, తేలుకాటుపై జాగ్రత్తగా ఉండాలి
జగిత్యాల: పాము, తేలుకాటుతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. ఐఎంఏ భవనంలో పాముకాటుపై అవగాహన కల్పించారు. పాము కాటువేస్తే తీసుకోవాల్సిన చర్యలను ప్రదర్శనల రూ పంలో వివరించారు. ఇటీవల పాము, తే లుకా టు కేసులు పెరిగాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటిపై అవగాహన కల్పించాలని సూ చించారు. ఈ సందర్భంగా మంచి ప్రదర్శనలు ఇచ్చిన వైద్యులను ప్రశంసించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రో గ్రాం ఆఫీసర్ జైపాల్‌రెడ్డి, అర్చన, జనరల్ ఆ స్పత్రి సూపరిండెంట్ సుమన్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment