రోడ్లు ఊడ్చి ఎస్‌ఎస్‌ఏల నిరసన
జగిత్యాలటౌన్: తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయాలని, పేస్కేల్ అమలుతోపాటు విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్లతో సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 26వ రోజుకు చేరింది. శనివారం జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద రోడ్లు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. అరకొర జీతాలతో పనిచేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. నాయకులు బర్ల నారాయణ, శ్రీనివాస్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
నిబంధనలు అమలుచేయాలి
జగిత్యాలరూరల్: గ్రామైక్య సంఘాల బైలా నిబంధనలు అమలుచేయాలని జిల్లా సెర్ప్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ చరణ్‌దాస్ అన్నారు. శనివారం మహిళ సమైక్యలతో సమావేశమయ్యారు. బైలాలో మార్పులు చేర్పులు, నాయకత్వ లక్షణాలు, మార్పిడిపై శిక్షణ ఇచ్చారు. మ్యాక్స్ యాక్ట్ చట్టం ప్రకారం బైలాలో కొన్ని మార్పులు, చేర్పులు చేశామని, ఈ మేరకు జిల్లాస్థాయిలో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. సీ్త్రనిధి ఆర్‌ఎం రాంనారాయణ, ఏపీఎం గంగాధర్, సీసీలు గంగారాం, సాగర్, మరియ, మండల సమైక్య అధ్యక్షురాలు మారు సత్తవ్వ, గంగజమున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment