స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి
● సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి
కోరుట్ల: స్థానిక సంస్థల్లో పోటీ చేసి సత్తా చాటాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నిరుపేదల పక్షాన, వారి హక్కుల కోసం వందేళ్లుగా పోరాడిన పార్టీ అని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు ఇళ్లు, ఆసరా పింఛన్లు, రైతుభరోసా, ఆటో, వ్యవసాయ కార్మికులకు ఆర్థిక సహాయం అమలు చేయాలన్నారు. జిల్లా నాయకులు చెన్నా విశ్వనాథం, సుతారి రాములు, ఎండీ.మౌలానా, ముఖ్రం, అక్రం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment