సావిత్రీబాయి ఆశయ సాధనకు కృషి
జగిత్యాల: సావిత్రీబాయి పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం సావిత్రీబాయి జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా విద్యకు సావిత్రీబాయి ఆద్యురాలిగా నిలిచారని, వారి త్యాగాలు మరువలేనివన్నారు. సమాజంలో చారిత్రాత్మక మార్పునకు పునాది వేశారన్నారు. అనంతరం మహిళ ఉపాధ్యాయులు, ఎంఈవోలను సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఏవో హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment