మేడిపల్లి మార్కెట్ కమిటీకి సన్మానం
మేడిపల్లి: మేడిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్, ఆరుగురు డైరెక్టర్లను రెడ్డి, యాదవ సంఘాల మండల శాఖల ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. మాజీ సర్పంచ్ లక్ష్మీరాజం, నాయకులు రవీందర్, రమేశ్, మహేందర్, దుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ డైరెక్టర్‌కు..
కథలాపూర్: వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ రమేశ్‌నాయక్‌ను గిరిజన సంఘం మండల నాయకులు ఆదివారం సన్మానించారు. సంఘం మండల అధ్యక్షుడు ప్రకాశ్‌నాయక్, నాయకులు రవినాయక్, తిరుపతినాయక్, లోక్యనాయక్, రాము నాయక్, పరమేశ్, జలంధర్ తదితరులున్నారు.
‘భరోసా’ రెండు పంటలకు ఇవ్వాలి
మల్యాల: ౖరెతు భరోసా రెండు పంటలకు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12 వేలు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వాలని, ఆసరా పింఛన్లను రెట్టింపు హామీని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం రైతును రాజుగా చేసేందుకు కిసాన్ సమ్మాన్ నిధి రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. నాయకులు గాజుల మల్లేశం, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, మల్లేశ్, రంజిత్, కిషన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment