అవినీతి జరిగితే విచారణ జరిపించండి
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల: రోల్లవాగు ప్రాజెక్ట్‌పై అవినీతి జరిగితే విచారణ జరిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గోదావరి నీరు విడుదల చేయించాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. 2016లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉమ్మడి సారంగాపూర్ మండలంలోని రోల్లవాగు ప్రాజెక్ట్‌ను ఆధునీకరించడం జరిగిందన్నారు. పావు టీఎంసీ నుంచి ఒక టీఎంసీ వరకు సామర్థ్యం పెంచి, 17 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 40 ఏళ్లు అధికారంలో ఉన్నా రైతులకు సాగునీరు అందించలేకపోయిందని ఆరోపించారు. అలాగే జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో గోదావరినదిపై ఎత్తిపోతల పథకాల ద్వారా పంటలకు నీ రు అందించడం జరుగుతుందన్నారు. రోల్లవాగు ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని పెద్దపెద్ద మాట లు మాట్లాడుతున్నారని, జరిగితే విచారణ జరి పించాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment