మరిన్ని సేవలు అందించాలి
జగిత్యాలజోన్: జిల్లా అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా న్యాయవాదులకు మరిన్ని సేవలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ అన్నారు. అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ రూపొందించిన 2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. సొసైటీ ద్వారా న్యాయవాదులకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు బండ భాస్కర్‌రెడ్డి, మారిశెట్టి ప్రతాప్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు డబ్బు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్‌రావు, పీపీ జంగిలి మల్లికార్జున్, ఏజీపీ ఓంప్రకాష్, న్యాయవాదులు పాల్గొన్నారు.
చైనా మాంజా వినియోగిస్తే చర్యలు
జగిత్యాలక్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా గాలి పటాలు ఎగరేసేందుకుని షేధిత చైనా మాంజా విని యోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. మాంజాలో ఉపయోగించే గాంజా పూత రాసిన నైలాన్, సింథటిక్ ధారాలు పక్షులు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా ఉపయోగించడం పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. చైనా మాంజాను ఎవరైనా తయారుచేసినా, విక్రయించినా డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.
ఆర్థిక పరిపుష్టి సాధించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: సహకార సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని జిల్లా సహకార అధికారి సీహెచ్ మనోజ్‌కుమార్ అన్నారు. జగి త్యాల రూరల్ మండలం కల్లెడ సొసైటీలో శుక్రవారం కామన్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించి, 2025 క్యాలెండర్ ఆవిష్కరించారు. జి ల్లాలోని చాలా సంఘాలు విత్తనాలు, ఎరువుల అమ్మకానికే పరిమితమవుతున్నాయని, ఆర్థికంగా ఎదిగేందుకు వ్యాపారాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. కేడీసీసీ జగిత్యాల శాఖ మేనేజర్ మోయిజ్ పాషా, సంఘ కార్యదర్శి శంకర్, అధ్యక్షుడు సందీప్‌రావు, ఉపాధ్యక్షుడు నల్లపు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
బోర్నపల్లి వంతెనకు రూ.17.50 కోట్లతో ప్రతిపాదనలు
రాయికల్(జగిత్యాల): మండలంలోని బోర్నపల్లి వంతెన నిర్మాణం కోసం ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు రూ.17.50 కోట్ల నిధుల వ్యయం అంచనావేసి సీఎం చొరవతో బడ్జెట్ ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 2న ‘సాక్షి’లో ‘బోర్నపల్లి వంతెనకు మోక్షమెప్పుడో’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఎమ్మెల్సీ స్పందించారు. బ్రిడ్జితో పాటు, బీటీరోడ్డు నిర్మాణం కోసం రూ.17.50 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపించారని, ఈ బడ్జెట్‌లో నిధులు విడుదలవుతాయని పేర్కొన్నారు. దీంతో గిరిజనుల చిరకాల వాంఛ నెరవేరుతుందన్నారు. దీనికి సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
చౌకధరల దుకాణాల తనిఖీ
జగిత్యాలరూరల్: రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా సివిల్‌సప్‌లై అధికారి జితేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని పలు చౌకధరల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కేటాయించిన విధంగా లబ్ధిదారులకు సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఫోర్టీఫైడ్ బియ్యంపై కార్డుదారులకు అవగాహన కల్పించారు. రేషన్ డీలర్లు సమయపాలన ప్రకారం సరుకులు పంపిణీ చేయడంతో పాటు, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు.
కొండగట్టు ఈవో బదిలీ
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయ ఈవో ఎంరామకృష్ణారావు సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ ఈవోగా శుక్రవారం బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సత్కరించి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment