ఒకేసారి రుణమాఫీ ఘనత కాంగ్రెస్‌దే..
● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: ఒకేసారి రూ.రెండు లక్షల రుణమాఫీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రణాళిక అమలుకు ఐదేళ్ల పరిమితి ఉన్నా.. రైతులు, పేదల సంక్షేమానికి కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ ఏకమొత్తంలో రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసి చూపించిందన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సాగుచేయని భూములకూ రైతుబంధు ఇచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్, బీజేపీకి రైతుకూలీలను ఆదుకోవాలన్న సోయి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలకు నచ్చడం లేదా అని ప్రశ్నించారు. విమర్శలు మానుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న మంచిని గ్రహించాలని కోరారు. సమావేశంలో నాయకులు విజయలక్ష్మి, దుర్గయ్య, బండ శంకర్, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, చందారాధాకిషన్, బీరం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment