● రైతుభరోసా రూ.15వేలు ఇవ్వాల్సిందే ● భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర కార్యదర్శి చేపూరి విజయభాస్కర్
మల్లాపూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర కార్యదర్శి చేపూరి విజయభాస్కర్ డిమాండ్ చేశారు. సంఘ్ మండల అధ్యక్షుడు కళ్లెం మహిపాల్‌తో కలిసి తహసీల్దార్ వీర్‌సింగ్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌తోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రైతులు పండించే అన్నిరకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని, మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, పంటల బీమా పథకాలను అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధించాలని, అసైన్ట్ భూముల రైతులకు యాజమన్య హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్‌సంఘ్ జిల్లా అధ్యక్షుడు రావుల లింగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కాసారపు భూమారెడ్డి, మాజీ ఎంపీటీసీ మొరపు గంగరాజం, రైతు సంఘం నాయకులు చిట్యాల లక్ష్మణ్, మల్లారెడ్డి, క్యాతం రాజేందర్‌రెడ్డి, ఇట్టెడి భాస్కర్, పోచంపల్లి రమేశ్‌రెడ్డి, ఎదులాపురం శ్రీనివాస్, కాకర గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment