తరలివచ్చి.. సమస్యలు విన్నవించి..
● జిల్లావ్యాప్తంగా 42 దరఖాస్తులు రాక ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ ● సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం
నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 42 అర్జీలు రాగా.. వాటిని పరిశీలించిన కలెక్టర్ సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్.లత, గౌతంరెడ్డి, జగిత్యాల కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసూదన్గౌడ్, జివాకర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment