ఈవీఎం గోదాముల తనిఖీ
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లోగల ఈవీఎం గోదాములను కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్.లత తనిఖీ చేశా రు. ప్రధాన ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతినెలా ఈవీఎంల భద్రతపై తనిఖీ చేస్తుంటారు. వారి వెంట ఆర్డీవో మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులూ.. ఆల్‌ది బెస్ట్
జగిత్యాల: విద్యార్థులు జాతీయస్థాయిలో రా ణించాలని అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి ఆకాంక్షించారు. గత నెల 7న నిర్వహించిన 52వ జి ల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో అత్యంత ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వారంతా ఈనెల 7 నుంచి 9 వరకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించే రాష్ట్రస్థాయి బాల విజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనున్నారు. వారిని ప్రత్యేక బస్సులో పంపించా రు. విద్యార్థులందరూ రాష్ట్రస్థాయిలో అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై జిల్లా కు గుర్తింపు తేవాలన్నారు. డీఈవో రాము, సైన్స్ అధికారి రాజశేఖర్, సెక్టోరియల్ అధికారి రాజేశ్, డీసీఈబీ సెక్రటరీ మురళీమనోహరాచా రి, జిల్లా అధ్యక్షుడు ఆనందరావు పాల్గొన్నారు.
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
జగిత్యాలక్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
పూజాసామగ్రి విక్రయానికి నేడు టెండర్
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పూజా సామగ్రి, ఫొటోలు, ఇతరత్రా సామగ్రిని ఏడాదిపాటు అమ్ముకునేందుకు ఈనెల 7న ఆలయ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 11.30 గంటలకు వేలం ప్రారంభమవుతుందని, టెండరుపొందిన వారు ఈనెల 18 నుంచి వచ్చే ఏడాది జనవరి 17 వరకు విక్రయాలు జరుపుకోవచ్చని పేర్కొన్నారు.
సర్కారు నిర్ణయంపై బీఆర్‌ఎస్ నిరసన
ధర్మపురి: రైతుభరోసా కింద ఏటా రూ.15వేలు ఇస్తామని అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మాట తప్పిందని పేర్కొంటూ బీఆర్‌ఎస్ నాయకులు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అయ్యోరి రాజేశ్‌కుమార్, ఆకుల రాజేశ్, అయ్యోరి వేణుగోపాల్, సంగి శేఖర్, బండారి అశోక్, స్తంభంకాడి మహేశ్, చీర్నేని నర్సయ్య, సాంబు, రంజిత్, విజయ్‌పాల్గొన్నారు.
పెంచిన కూలీ రేట్లు అమలు చేయాలి
జగిత్యాలటౌన్: ప్రభుత్వం పెంచిన కూలీ రేట్ల అమలుకు జీవో విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న మహేశ్ కోరారు. సోమవారం సివిల్ సప్లయీస్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయ పాలనాధికారికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు సుతారి రాములుతో పాటు కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment