శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
రైతుబంధు అందించిన ఘనత కేసీఆర్‌దే..
జగిత్యాలరూరల్: రైతులకు పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించిన ఘనత కేసీఆర్‌దేనని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో రైతులతో కలిసి పొలంలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలుగా ప్రకటించి ఇప్పుడు రూ. 12 వేలే ఇస్తామనడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 11 సీజన్లకు రైతుబంధు అందుకున్నారని తెలిపారు. నాయకులు ఆనందరావు, తుమ్మ గంగాధర్, ఆసీఫ్, కమలాకర్‌రావు, గంగారావు, గంగారెడ్డి, ప్రవీణ్, లక్ష్మణ్, సందీప్‌రావు, శరత్‌రెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.
జగిత్యాల: శానిటేషన్‌పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం ఎంపీవో, ఎంపీడీవోలతో సమావేశమయ్యారు. అధికారులు ప్రతి రోజూ వారివారి మండలాల పరిధిలోని గ్రామాలను సందర్శించి పంచాయతీ కార్యదర్శులు చేపడుతున్న పనులను పరిశీలించాలన్నారు. ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించేలా చూడాలన్నారు. ఇంటి పన్ను వందశాతం వసూలయ్యేలా చూడాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రానీయొద్దని, ఇందిరమ్మ ఇళ్ల సర్వే వందశాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు గౌతంరెడ్డి, రఘువరణ్ పాల్గొన్నారు.
భూమి వివరాలు నమోదు చేయండి
సారంగాపూర్: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటి స్థలం వివరాలు సేకరించాలని కలెక్టర్ అన్నారు. బీర్‌పూర్‌లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. లబ్ధిదారుడు ఇల్లు ఎక్కడ నిర్మించుకుంటాడో పరిశీలించాలని, ఆ స్థలం వంశపారంపర్యంగా సంక్రమించిందా..? కొనుగోలు చేసిందా..? ప్రభుత్వం మంజూరు చేసిందా..? అని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. పాత ఇంటిని తొలగించిన స్థలంపైనా వివరాలు తీసుకోవాలన్నారు. మండలకేంద్రంలో 98 శాతం ర్వే పూర్తయిందని ఎంపీడీవో లచ్చాలు తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి
గోదావరి వెంట ఇసుక నిల్వలను అక్రమంగా తరలిస్తున్నారని, ఇది పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జేసీబీలతో కందకాలు తవ్వించాలని తహసీల్దార్ ముంతాజో దీ ్దన్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment