కాంగ్రెస్ సమావేశంలో ఉద్రిక్తత
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ జిల్లా డిచ్‌పలిలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్త ల సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశానికి ముందు ఏఐసీసీ ఆదేశాల మేరకు కార్యక్రమానికి హాజరైన ముఖ్య కార్యకర్తలు గేటు వద్ద ఉ న్న రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సూచించా రు. అక్కడ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గీయుల పేర్లు మాత్రమే ఉండటంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వర్గీయులు ఆగ్రహానికి లోనయ్యారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు మానాల మోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్‌రెడ్డి వర్గీయుల పేర్లు లేకపోవడంపై నిలదీశారు. అసహనానికి లోనైన మోహన్‌రెడ్డి తనను ప్రశ్నించడానికి మీరెవరని మండిపడ్డారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా తన వర్గీయుల పేర్లు లేకపోవడంపై అంసతృప్తి వ్యక్తం చేశారు. కష్టకాలంలో కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీకి సేవ చేస్తున్న తనను కాదని ఎమ్మెల్యే సంజయ్‌ను సమావేశానికి ఎలా పిలుస్తారని మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. అక్కడ ఉన్న ఇతర నాయకులు కలుగచేసుకుని ఇద్దరినీ సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో జీవన్‌రెడ్డి వర్గీయులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా సంజయ్ వర్గీయులు కూడా నినాదాలు చేయడంతో రాష్ట్ర నాయకులు చేసేది లేక మిన్నకుండిపోయారు. జీవన్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించగానే మళ్లీ ఆయన వర్గీయులు కొద్దిసేపు నినాదాలతో హోరెత్తించారు. సమావేశం అనంతరం కూడా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గాల వాగ్వాదం
నినాదాలు వద్దంటూ కార్యకర్తలను వారించిన జీవన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment