● వాష్‌రూంలను వారంలో అందుబాటులోకి తేవాలి ● జిల్లా అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను ఆర్నెళ్లలో పూర్తి చేయాలని, వాష్‌రూంలను వారంలోపు అందుబాటులోకి తేవాలని అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి జగిత్యాల బల్దియా అధికారులను ఆదేశించారు. మనబస్తీ – మన బడి కార్యక్రమం కింద ప్రారంభించిన పాఠశాల పనులు 20 నెలలు గడిచినా పునాదులు దాటలేదని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లలిత, మరికొందరు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రచురించగా.. స్పందించిన కలెక్టర్ సత్యప్రసాద్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అదనపు కలెక్టర్ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, పనులు ప్రారంభించేలా చూడాలని బల్దియా అధికారులను ఆదేశించారు. ఆయన వెంట బల్దియా కమిషనర్ చిరంజీవి, ఇంజినీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment