తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు
జగిత్యాలటౌన్: రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాలతోనే అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయని జగిత్యాల డిపో మేనేజర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో జగిత్యాల బస్టాండ్‌లో డ్రైవర్లు, సిబ్బందికి అవగాహన కల్పించారు. చిన్న నిర్లక్ష్యం కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందన్నారు. కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని సూచించారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, లైసెన్స్ లేని ప్రయాణాలను పోలీసు శాఖ ఉపేక్షించదని పట్టణ సీఐ వేణుగోపాల్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ఎంవీఐలు అభిలాష్, రామారావు, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం, ఆర్టీసీ, రవాణా శాఖ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ప్రయాణీకుల భద్రత ముఖ్యం
అవగాహన సదస్సులో డీటీవో శ్రీనివాస్
పాల్గొన్న జగిత్యాల ఆర్టీసీ డీఎం సునీత
Comments
Please login to add a commentAdd a comment