4.17 లక్షల ఎకరాలు.. 2.40 లక్షల మంది రైతులు
● సాగు భూములకే ‘రైతుభరోసా’ ● ఎకరాకు రూ.12వేల చొప్పున జమ ● జిల్లాకు సుమారు రూ.200 కోట్లు వచ్చే అవకాశం
పెద్దపల్లి బాలుర హాస్టల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు, కిటికీ దుస్థితి
రోజు: మంగళవారం
సమయం: రాత్రి 9–10గం.ల మధ్య
వసతి అధ్వానం
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని సంక్షేమ వసతి గృహాలను మంగళవారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ‘సాక్షి’ విజిట్ చేసింది. పలు హాస్టళ్లలో బెడ్లు లేక విద్యార్థులు నేలమీద పడుకున్నారు. కొన్నిచోట్ల పరుపులు చిరిగిపోయి, కిటికీల తలుపులు విరిగిపోయి ఉన్నాయి. విద్యార్థులు సమస్యలతో సావాసం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్లు
కరీంనగర్/పెద్దపల్లి/సిరిసిల్ల/జగిత్యాల
హోటళ్లలో బల్దియా సిబ్బంది తనిఖీ
జగిత్యాల: జిల్లాకేంద్రంలో హోటళ్ల తీరు మా రడం లే దు. కుళ్లిపోయిన చికెన్, గు డ్లతోపాటు పరిశుభ్రత పా టించడం లేదు. కాంతిభవన్ ఎదుట ఉన్న ఓ హోట ల్‌లో బల్దియా సిబ్బంది మంగళవారం తనిఖీలు చే యగా అపరిశుభ్రతతో పాటు.. నా ణ్యత లేని చికెన్ బయటపడింది. దీంతో హోటల్‌కు రూ.5వేల జరిమానా విధించారు. అయితే బల్ది యా, ఆహార భద్రత అధికారుల తీరుపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. కుళ్లిపోయిన చికెన్ వాడుతున్నా.. పాచిపోయిన గుడ్లు వాడుతూ పట్టుబడినా నామమాత్రపు జరిమానా విధిస్తున్నారని, ఆ మొ త్తాన్ని హోట్ నిర్వాహకులు చెల్లిస్తూ య థావిధిగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని చెబుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప హోటళ్లలో మార్పు రాదంటున్నారు. అలాగే పలు కిరాణం షాపుల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా ప్లాస్టిక్ కవర్లు బయటపడ్డాయి. మున్సిపల్, ఆహారభద్రత అధి కారులు నిత్యం తనిఖీలు చేయడంతోపాటు పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తే తప్ప మారే పరిస్థితి లేదు.
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఎకరాకు ఏటా రూ.12 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మొత్తం కూడా సాగు భూములకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించింది. జిల్లాలో సుమారు 2.40లక్షల మంది రైతులు ఉన్నారు. అలాగే 4.17 లక్షల ఎకరాల వరకు ఉంది. ఈ లెక్కన జిల్లా రైతులకు సుమారు రూ.200 కోట్లు జమ అయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12 వేల వరకు ఇవ్వనుంది. వానాకాలం సీజన్ ముగిసినందున ప్రస్తుత యాసంగి సీజన్‌కు మాత్రమే రైతుభరోసా ఇచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం.. బుగ్గారం మండలంలోని 7509 మంది రైతులకు రూ.6.27 కోట్లు, ధర్మపురిలో 16,357 మందికి రూ.13.12కోట్లు, ఎండపల్లిలో 10,135 మందికి రూ.7.74 కోట్లు, గొల్లపల్లిలో 16,841 మందికి రూ.14.50కోట్లు, పెగడపల్లిలో 14,280 మందికి రూ.11.99కోట్లు, వెల్గటూర్‌లో 9,782 మందికి రూ.7.71 కోట్లు, బీర్‌పూర్‌లో 8,258 మందికి రూ.6.95 కోట్లు, భీమారంలో 6,055 మందికి రూ.7.38 కోట్లు, జగిత్యాల అర్బన్‌లో 5,689 మందికి రూ.2.60 కోట్లు, జగిత్యాల రూరల్‌లో 17,441 మందికి రూ.13.70 కోట్లు, కొడిమ్యాలలో 12,609 మందికి రూ.11.60 కోట్లు, మల్యాలలో 11,775 మందికి రూ.10.62 కోట్లు, మేడిపల్లిలో 8,647 మందికి రూ.9.24 కోట్లు, రాయికల్‌లో 15,368 మందికి రూ.15.93 కోట్లు, సారంగాపూర్‌లో 7,668 మందికి రూ.6.46 కోట్లు, ఇబ్రహీంపట్నంలో 10,929 మందికి రూ.11.25 కోట్లు, కథలాపూర్‌లో 13,545 మందికి రూ.14.05 కోట్లు, కోరుట్లలో 13,888 మందికి రూ.12.37 కోట్లు, మల్లాపూర్‌లో 15,646 మందికి రూ.15.91 కోట్లు, మెట్‌పల్లిలో 17,396 మందికి రూ.14.84 కోట్ల చొప్పున వచే అవకాశం ఉంది. అధికారుల సర్వే తర్వాత కొంత పెరగవచ్చు.. లేదా తగ్గే అవకాశం కూడా ఉంది.
వీటికి రైతు భరోసా నో..
రైతులకు ఎంత భూమి ఉంటే అంతకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు సాయం అందించిన విషయం తెల్సిందే. ఈ సారి వాటన్నింటికి పుల్‌స్టాప్ పెడుతూ.. సాగు యోగ్యమైన భూమికి మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం సాగు భూములకు మాత్రమే ఇవ్వనుంది. వీటికి సంబంధించి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment