ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

Published Thu, Jan 9 2025 1:07 AM | Last Updated on Thu, Jan 9 2025 1:07 AM

ప్రభు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

మెట్‌పల్లిరూరల్‌: ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్‌ అన్నారు. మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. జగ్గాసాగర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, మందుల స్టాక్‌, వ్యాధి నిరోధక టీకాలు, ల్యాబ్‌ పరిశీలించారు. టి హబ్‌కు పంపిస్తున్న శాంపిల్స్‌, క్షయ వ్యాధి కేసుల వివరాలపై ఆరా తీశారు. వెల్లుల, ఆత్మకూర్‌ సబ్‌సెంటర్లలో వ్యాధి నిరోధక టీకాలు వేయించారు. జిల్లా ప్రొగ్రాం ఆఫీసర్‌ శ్రీనివాస్‌, మెట్‌పల్లి మండల వైద్యాధికారి అంజిత్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సూరమ్మ ప్రాజెక్టు కాలువకు భూములివ్వం

కథలాపూర్‌: మండలంలోని కలిగోట శివారులోగల సూరమ్మ ప్రాజెక్టు కుడికాలువకు తమ భూములు ఇవ్వబోమని కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డికి రైతులు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. కలిగోటలో గ్రామపంచాయతీ ఆవరణలో ఆర్డీవో రైతులతో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో 48 ఎకరాలు కుడి కాలువకు అవసరమని అధికారులు తెలిపారు. దీనిపై రైతులు మాట్లాడుతూ తమకు భూమి తక్కువగా ఉందని, భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేకుంటే ఎకరాకు రూ.40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని విన్నవించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వినోద్‌, డెప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్‌ఐ నగేశ్‌, రైతులు పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ నేరం

జగిత్యాల: స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ధారణ చేస్తే నేరమని మాతాశిశు సంక్షేమ కేంద్రం ప్రోగ్రాం అధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫర్టిలిటీ సెంటర్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, స్కానింగ్‌ యంత్రాలను పరిశీలించారు. ప్రతినెలా ఐదో తేదీలోపు మోతెవాడలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఫాం ఎఫ్‌ సబ్మిట్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు భూమేశ్వర్‌, తరాల శంకర్‌, రాజేశం పాల్గొన్నారు.

పట్టుదలతో చదవాలి

జగిత్యాలరూరల్‌: పట్టుదలతో చదివి లక్ష్యాన్ని సాధించాలని డీఈవో రాము అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాం జిల్లా పరిషత్‌ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీవితంలో విద్యార్థి దశ కీలకమైందన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చిన శివరాత్రి శరణ్య, అల్లె పూజలను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సింగు సత్తయ్య, ఉపాధ్యాయులు భూపతిరావు, బాలె సరోజ, అనిత, రాజేందర్‌, ఫకృద్దీన్‌, శరత్‌, పీడీ కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

మంచి మార్కులతో

ఉత్తీర్ణత సాధించాలి

సారంగాపూర్‌: ఇంటర్‌లో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఇంటర్‌ విద్యాధికారి బి.నారాయణ అన్నారు. బుధవారం సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి మంచి మార్కులు తెచ్చుకునేలా చూడాలన్నారు. ప్రిన్సిపల్స్‌ వై.రమేశ్‌బాబు, రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభుత్వ ఆసుపత్రుల్లో  మెరుగైన వైద్యం1
1/3

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో  మెరుగైన వైద్యం2
2/3

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో  మెరుగైన వైద్యం3
3/3

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement