రైతులకు సాగునీటి కొరత రానీయొద్దు
● ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్
జగిత్యాల: రైతులకు సాగునీటి కొరత లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రతి ఎకరాకూ నీరందేలా చూడాలని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. రైతుల కోసం ప్రాజెక్ట్‌ల నుంచి నీటి విడుదలను వేగవంతం చేసి సాగు అవసరాలు తీర్చాలన్నారు. వారబందీ ద్వారా జోన్–1, జోన్–2కు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నీటి విడుదల చేయాలని సూచించారు. కొన్నిచోట్ల మోటార్లు పెట్టడం, ఇతరత్రా కారణాలతో నీరు అందక ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్య రాకుండా చూడాలని తెలిపారు. జంగనాలా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇప్పటికే గోదావరిలోకి టీఎంసీ నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు నీరందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌ఈలు, డీఈలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment