బీపీ
పెరుగుతోంది..
తీపి
● యువతే 40 శాతం
● మారుతున్న జీవనశైలి
ప్రధాన కారణం
జగిత్యాల/సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్‌టౌన్/సిరిసిల్ల:
ఈ మధ్య కాలంలో ఎవరిని కదిలించినా .. బీపీ వచ్చిందండి.. షుగర్ అటాక్ అయ్యింది అంటున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌సీడీ(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) సర్వేలోనూ బీపీ, షుగర్ బాధితుల సంఖ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పెరుగుతున్నట్లు తేలింది. మారుతున్న జీవన శైలి, వృత్తి, ఉద్యోగ జీవితాల్లో ఒత్తిడులు, శారీరక వ్యాయామానికి సమయం కేటాయించకపోవడం తదితర కారణాలతో చాలామంది బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో వీధికొక్కరో.. ఊరికిద్దరో ఉండే బాధితుల సంఖ్య ప్రస్తుతం కనీసం ఇంటికొకరిగా మారిపోయింది. ఈ వ్యాధుల బారిన పడుతున్న వారిలో యువత సైతం అధిక సంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 50, 60 ఏళ్లు దాటిన వారికి వచ్చేవి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 40 ఏళ్లలోపు వారు కూడా బాధితులవుతున్నారు. మరోవైపు పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా వస్తున్నాయి. ఒక్కసారి వస్తే వీటికి జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి.
గుర్తించేందుకు సర్వే..
జీవనశైలి మారడంతో 30 ఏళ్లవారు కూడా మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. ఇలాంటి వారు వేలాది మంది ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం ఎన్‌సీడీ సర్వే చేపడుతోంది. పీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా వైద్య పరీక్షలు చేస్తూ బీపీ, షుగర్ వ్యాధులను గుర్తిస్తోంది. నోటి కేన్సర్, గైనిక్ సంబంధిత కేన్సర్ లక్షణాలున్నవారిని నిర్ధారణ కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. బీపీ, షుగర్ ఉన్నవారికి మందులు అందిస్తూ వ్యాధి తీవ్రం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 84.02 శాతం పరీక్షలు పూర్తవగా.. రక్తపోటు, మధుమేహం ఉన్నవారిని పెద్ద సంఖ్యలో గుర్తించారు. వారి వివరాలు వెబ్‌పోర్టల్‌లో నమోదు చేస్తూ ఎన్‌సీడీ కార్డు అందిస్తున్నారు. ఇందులో పేషెంట్ పేరు, వ్యాధికి ఇస్తున్న మందుల వివరాలు పొందుపరుస్తున్నారు. పీహెచ్‌సీ పరిధిలో ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రతినెలా మందులు అందిస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లోనే అధికం..
గత ఐదేళ్లలో చూస్తే బీపీ, షుగర్ బారిన పడుతున్న వారిలో యువత సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మొత్తం బాధితుల్లో 40 శాతం మంది వరకు యువతే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా మధుమేహం, రక్తపోటు బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,26,204 మంది రక్తపోటు, 1,00,675 మంది మధుమేహ బాధితులు ఉన్నారు.
జీవనశైలిలో మార్పు రావాలి
ప్రస్తుతం 30ఏళ్ల వారికే బీపీ, షుగర్ వస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు వస్తేనే వీటిని అరికట్టవచ్చు. యువత జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం, వాకింగ్ చేయకపోవడంతో షుగర్, బీపీ వస్తున్నాయి. వంశపారంపర్యంగానూ వస్తా యి. తల్లిదండ్రులకు బీపీ, షుగర్ ఉన్న యువత జాగ్రత్తపడాలి. మొదటి నుంచి జాగ్రత్తలు పాటిస్తేనే బీపీ, షుగర్ రావు. ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఒత్తిడి లేకుండా నిత్యం యోగా చేయాలి.– కె.ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో
జిల్లాల వారీగా ఎన్‌సీడీ సర్వే వివరాలు
4,33,825
5,72,325
5,48,075
3,95,498
4,71,320
52,985
54,954
22,325
25,615
పెద్దపల్లి
కరీంనగర్
తరుముతోంది!
పరీక్షలు చేయాల్సినవారు
పూర్తయిన వారి సంఖ్య
వీరిలో రక్తపోటు బాధితులు
మధుమేహం బాధితులు
Comments
Please login to add a commentAdd a comment