రాష్ట్రంలో అరాచక పాలన
● కమలదళం దండెత్తితే కాంగ్రెస్ దాక్కోవడానికి జాగ దొరకదు ● కాంగ్రెస్‌లో చేరలేదన్న ఎమ్మెల్యే పార్టీ మీటింగ్‌కు ఎలా వెళ్లారు..? ● బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి
జగిత్యాలటౌన్: రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజాప్రభుత్వం కాదని, ప్రజల నడ్డి విరుస్తూ.. ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్న అరాచక ప్రభుత్వమని బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి భోగ శ్రావణి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేయడాన్ని ఖండించారు. కమలదళం దండెత్తి వస్తే కాంగ్రెస్ వాళ్లకు దాక్కోవడానికి స్థలం కూడా దొరకదని హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం పేరుతో రేవంత్‌రెడ్డి అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అన్నా రు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకే దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ దళం తలచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటుందో ఆలోచించుకోవాలన్నారు. తాను బీఆర్‌ఎస్‌ను వీ డలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు.. అంటున్న ఎమ్మె ల్యే సంజయ్ డిచ్‌పల్లి కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. జీవన్‌రెడ్డి నలభై ఏళ్లుగా కాపాడుతూ వచ్చిన కాంగ్రెస్ చీమల పుట్టలో సంజయ్ పాములా దూరా డని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఆముద రాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, సిరికొండ రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగరాజం, సింగం ప ద్మ, మామిడాల కవిత, సాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment