గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
జగిత్యాల: గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో (ఆంగ్లమాధ్యమం) ప్రవేశానికి ఫిబ్రవరి 23న పరీక్ష ఉంటుందని, www.tgcet.cgg.gov.i n ద్వారా ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి ఒకటో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆదాయం, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు, ఫొటో అవసరముంటుందని తెలిపారు. కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదోతరగతి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9 తరగతుల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గౌళిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకులంలో 9వ తరగతి, ఖమ్మం జిల్లా పరిగిలోని గిరిజన సంక్షేమ గురుకులంలో 8వ తరగతి, అల్గునూర్‌లోని సీఈవో పాఠశాలలో 9వ తరగతి, రుక్మాపూర్ సైనిక్‌స్కూల్, మల్కాజ్‌గిరి స్కూల్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హాస్టళ్లలో మెనూ అమలు చేయాలి
హాస్టళ్లలో మెనూ అమలుచేయాలని కలెక్టర్ అన్నా రు. హెడ్మాస్టర్లతో బుధవారం సమావేశమయ్యారు. పిల్లల్లో ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌ను నిర్ణయించి సీ, డీ కేటగిరీల పిల్లలపై శ్రద్ధ వహించాలన్నారు. ఫు డ్‌పాయిజన్ సంఘటనలు చోటుచేసుకోకుండా చ ర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతిలో వందశా తం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఈవో రాము పాల్గొన్నారు.
డైరీ ఆవిష్కరణ
కలెక్టరేట్ ఉద్యోగుల అసోసియేషన్ రూపొందించిన డైరీని కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. అధికారుల పనితీరును మెరుగుపర్చుకునే లా డైరీ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్, శ్రీనివాస్, వెల్ఫేర్ ఆఫీసర్ చిత్రు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment