● ఐదో తరగతి నుంచి 9 వరకు..
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధారణ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఐదో తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జోనల్ –2 ఆఫీసర్ ఫ్లోరెన్స్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగు నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనకబడిన తరగతుల విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాలలో ఏడాదికి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 లక్షల లోపు ఉండాలని, ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ www. tswreis.ac. in లేదా http:// tgcet. cgg. gov.in వెబ్‌సైట్‌లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 23 ఫిబ్రవరి 2025న జరిగే ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలల ప్రాధాన్యత ప్రకారం ప్రవేశాలు ఉంటాయన్నారు. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన, ఉచిత భోజనం, వస తి సదుపాయాలు ఉంటాయని, ఫిబ్రవరి ఒకటో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment