‘కోటిలింగాల’ అభివృద్ధి త్వరగా పూర్తిచేయాలి
వెల్గటూర్: కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ లక్ష్‌మ్‌ణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కోటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి, ఇతర సమస్యలపై దేవా దాయ, రెవెన్యూ, ఇరిగేషన్, మేఘా కంపెనీ ప్రతి నిధులతో సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.20వేల కోట్ల అంచనాతో కాళేశ్వరం లింక్–2 ప్రాజెక్టును ప్రారంభించి ఇక్కడి నీటిని సిద్దిపేటకు తరలించే ప్రయత్నం చేసిందన్నారు. సీఎస్సార్ నిధులను పట్టించుకోలేదని విమర్శించా రు. సీఎస్సార్ నిధులు రూ.2.5కోట్లతో కోటిలింగా ల ఆలయ రాజగోపురం, మరో రూ.2.5 కోట్లతో ఆలయ పునఃనిర్మాణం పూర్తి చేయాలని మేఘా కంపెనీ ప్రతినిధులకు సూచించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తా గునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు శాశ్వత షెడ్ల నిర్మాణాలు శివరాత్రి లోపు పూర్తి చేయాలని ఆదేశించా రు. కాళేశ్వరం లింక్–2 నుంచి జంగల్‌నాలా చెరు వు, చుట్టుపక్కల చెరువులకు అనుసంధానిస్తూ ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాకే ఇతర అవసరాలకు తరలించాలన్నారు. అనంతరం మండలకేంద్రంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఇరిగేషన్ డీఈ న ర్సింగరావు, తహసీల్దార్ శేఖర్, మేఘా కంపెనీ ఏజీ ఎం రవిబాబు, దేవాదాయశాఖ ఈవో కాంతారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment