బాలికల పాఠశాల పూర్తి చేయండి
మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద పునర్నిర్మాణం పేరుతో జిల్లా కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని కూల్చివేశారు. పనులు ప్రారంభించి 20 నెలలు గడుస్తున్నా పునాదులు దాటలేదు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 293మంది ఐదు గదుల్లో సర్దుకోలేక అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో చదువుతున్న 216మంది బాలికలకు ఒకే వాష్‌రూం ఉంది. బాలురు, సిబ్బందికి లేనేలేదు. వారు ఆరుబయటకు వెల్లలేక ఇబ్బంది పడుతున్నారు. త్వరితగతిన బాలికల పాఠశాల నిర్మాణం పూర్తి చేయాలి.
– ఏఏపీసీ చైర్మన్ లలిత
భూ ఆక్రమణలు అరికట్టండి
ఇబ్రహీంపట్నం మండలకేంద్రానికి చెందిన బోడ దివాకర్ అనే వ్యక్తి విలేకరి ముసుగులో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న పంచాయతీ స్థలం, ఇందిరాగాంధీ చౌరస్తాలోని హైస్కూల్ గేట్ పక్కరోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నాడు. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమంగా నిర్మాణం చేయడంతోపాటు ప్రెస్‌క్లబ్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఈ విషయమై గతంలోనూ పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన. ఎవరూ పట్టించుకోవడం లేదు. దివాకర్ భూకబ్జాపై విచారణ జరిపించండి.
– బద్ది రాములు, ఇబ్రహీంపట్నం
Comments
Please login to add a commentAdd a comment