క్రీడాకారులు ఉన్నతస్థానంలో నిలవాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: క్రీడాకారులు మరింత ఉన్నత స్థానంలో నిలిచి జిల్లాకు పేరు తేవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. చీఫ్ మినిస్టర్ కప్– 2024లో భాగంగా రాష్ట్రస్థాయిలో జరిగిన క్రీడల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. వారిని కలెక్టర్ అభినందించారు. బాక్సింగ్ విభాగంలో కె.తేజస్విని సిల్వర్, అఖిల్ బ్రౌంజ్, జె.బాలాజీ బ్రౌంజ్, యోగాలో సాయిప్రసన్న బ్రౌంజ్, మిక్విత్ గోల్డ్, పవర్ లిఫ్టింగ్‌లో శ్రావ ణి, పూజిత బ్రౌంజ్, జ్యోత్స్న సిల్వర్, ఐశ్వర్య సిల్వర్, స్నాపిక గోల్డ్‌మెడల్ సాధించారు. అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి, ఆర్డీవో మధుసూదన్, క్రీడల అభివృద్ధి అధికారి రవికుమార్ పాల్గొన్నారు.
గవర్నర్ అనుమతితోనే కేటీఆర్‌పై కేసు
కథలాపూర్(వేములవాడ): మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతో కేసు పెట్టలేదని, ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకునే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్‌పై ఏసీబీ పెట్టిన కేసులో సాక్ష్యాలు ఉండడంతోనే విచారణకు ఆదేశించారని, కేటీఆర్‌పై పెట్టింది లొట్టపీస్ కేసైతే హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. కేటీఆర్ తప్పు చే శాడు కాబట్టే భయం పట్టుకుందన్నారు. తప్పు చేసినవారికి చట్టం ప్రకారం శిక్ష తప్పదన్నారు.
తుదిదశకు క్రిటికల్ కేర్ యూనిట్
సారంగాపూర్: జిల్లాకేంద్రంలో రూ.14 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ పూర్తికావచ్చిందని, త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని నాగునూర్‌లో రూ.20లక్షలతో ని ర్మిస్తున్న పల్లెదవాఖానాకు భూమిపూజ చేశారు. పోచంపేటలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రా మ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల, సూపర్ స్పె షాలిటీ ఆస్పత్రి ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. నియోజకవర్గంలో 14 పల్లెదవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో జయపాల్‌రెడ్డి, ఎంపీడీవో గంగాధర్, మండల వైద్యాధికారి రాధ, పీఆ ర్ ఏఈ రాజమల్లయ్య, విండో చైర్మన్ గుర్నాథం మల్లారెడ్డి, ఏలేటి నర్సింహ్మారెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment