రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది
● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
రాయికల్(జగిత్యాల): సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయికల్‌లో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే 90 శాతం మంది రైతులకు రుణమాఫీ చేశారని, మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుణమాఫీ చేస్తారని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 ఇస్తున్న ఘనత సీఎందేనని గుర్తుచేశారు. ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంట సాగు చేస్తున్న ప్రతీ రైతు కు ఈనెల 15 నుంచి ఎకరాకు రూ.7,500 అందిస్తున్నామని, దీని కోసం రైతులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అల్లీపూర్ మండల కేంద్రం ఏర్పాటుకు త్వరలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అవుతాయని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు గోపి రాజిరెడ్డి, మ్యాకల రమేశ్, మహిపాల్‌రెడ్డి, బాపురపు నర్సయ్య, ఆంజనేయులు, షాకీర్, దివాకర్‌రెడ్డి, దాసరి గంగాధర్, గుమ్మడి సంతోష్, ఏలేటి జలేందర్‌రెడ్డి, మండ రమేశ్, బత్తిని భూమయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment