చిరుత కలకలం..?
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్‌పల్లి మండలం రంగారావుపేట శివారులో చిరుత సంచారం విషయం కలకలం రేపుతోంది. గ్రామ శివారులోని తాతమ్మ గుడి సమీపంలో ఓ ఫామ్‌హౌస్ దగ్గర కుక్క చనిపోయి ఉంది. ఏదో జంతువు పీక్కు తిన్నట్లు ఉండడాన్ని ఆదివారం గ్రామస్తులు గమనించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సత్తర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడికి చేరుకున్న ఆయన కుక్క కళేబరాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడ జంతువు పాదముద్రలు ఉన్నట్లు గుర్తించారు. కాగా పాదముద్రలు చిరుతలాగే ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆత్మనగర్, ఆత్మకూర్, పాటిమీది తండా, రంగారావుపేట, ఏఎస్‌ఆర్‌తండా తదితర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కౌలు రైతు రమేశ్ అనే వ్యక్తి మొక్కజొన్న పంట రక్షణ కోసమని పెంపుడు కుక్కను వ్యవసాయక్షేత్రంలో కట్టివేశాడని, ఆ మరుసటి రోజు తెల్ల్లవారేసరికే కుక్క చనిపోయి ఉందని గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment