చుట్టూ చెరువులే.. నీరంతా కలుషితమే..
● జలవనరుల్లో కలుస్తున్న పట్టణ డ్రైనేజీ నీరు ● పూర్తికాని సివరేజ్ ట్రీట్ ప్లాంట్లు ● అండర్ డ్రైనేజీ లేక అవస్థలు
జగిత్యాల: జిల్లాకేంద్రం చుట్టూ ఐదు చెరువులు న్నాయి. మోతె, కండ్లపల్లి, లింగం, ముప్పారపు, చింతకుంట చెరువులుగా పిలుస్తారు. అయితే జగి త్యాలలో అండర్ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడంతో వృథా నీరంతా ఈ చెరువుల్లోకే చేరుతోంది. ఫలితంగా నీరుమొత్తం కలుషితం అవుతోంది. ఈ ఐదు చెరువుల నుంచే పట్టణ ప్రజలకు అవసరమై న నీటిని సరఫరా చేస్తున్నా రు. పైగా మత్స్యకారులు ఈ చెరువులపైనే ఆధారపడి జీవి స్తున్నారు. నీరు పూర్తిగా కలు షితం కావడంతో వాటిని వేటికీ ఉపయోగించుకోవడం లేదు. సివరేజీ ట్రిట్‌మెంట్ ప్లాంట్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం జగిత్యాలలో 48వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుల నుంచి వెలువడే డ్రైనేజీ నీరు పట్టణానికి చుట్టూరా ఉన్న ఈ చెరువుల్లోకే చేరుతుంది. దీంతో అందులో మత్స్యకారులు పెంచుతున్న చేపలు తినడంతో కొన్నిసార్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ చెరువుల్లో పెంచుతున్న చేపలనే జగిత్యాలలో అమ్ముతుంటారు. ఐదు పెద్ద చెరువులే కావడం.. అందులో లక్షలాది చేపలు పెంచుతూ మత్స్యకారులు జీవనాధారం పొందుతున్నారు. అయితే డ్రైనేజీ నీటి కారణంగా చేపల వ్యాపారం తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు చేరే ప్రాంతాల్లో సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏ ర్పాటు చేస్తే మే లంటున్నా రు స్థానికులు.
ఆక్రమణలు అధికం
చెరువుల్లోకి వెళ్లే డ్రైనేజీ కాలువలు కూడా సక్రమంగా లేవు. ఎక్కడపడితే అక్కడ మురికినీరు నిలిచిపోతోంది. మరోవైపు చెరువుల సమీపంలో ఉన్న భూములు రేట్లు అమాంతం పెరగడం.. రూ.కోట్లు పలుకుతుండడంతో ఆక్రమణలు కూడా అధికమవుతున్నాయి. బఫర్‌జోన్ సమీపంలో ఉన్న భూములను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ముందుకు కదలని అండర్ డ్రైనేజీ వ్యవస్థ
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో అండర్ డ్రైనేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. కానీ ఆ ప్రణాళిక పట్టాలు ఎక్కలేదు. ఇది చుట్టూరా ఉన్న చెరువులకు శాపంగా మారింది. శివారు ప్రాంతాల్లో అత్యధికంగా ఇళ్లు వెలుస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు నిర్మిస్తున్నా ఆ నీరు ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
అడుగుముందుకు పడేనా..?
పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎంపీ అర్వింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఇటీవలే కలిసి విజ్ఞప్తి చేశారు. అమృత్–2 ప్లాన్ కింద ప్రతిపాదించి స్వచ్ఛభారత్ అభియాన్ కింద ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చే యాలని కోరారు. దీంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీపై స్థానికులు ఆశలు పెట్టుకుంటున్నారు.
మురికినీటిని శుభ్రం చేసేందుకు
చెరువుల వద్దగానీ, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంటారు. అయితే జిల్లాకేంద్రమైనా ఎక్కడా
ఈ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు లేవు. ఇటీవల ఆస్పత్రిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే చెరువుల వద్ద అ వసరమున్న చోట్ల డ్రైనేజీ నీటిని శుద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని పట్టణప్రజలు కోరుతున్నారు.
సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఎప్పుడో..?
Comments
Please login to add a commentAdd a comment